calender_icon.png 17 January, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం

01-07-2024 01:23:22 AM

  • లైటనింగ్ ఎట్రాక్షన్ రాడ్ నిర్వహణలో లోపం

బీటీపీఎస్‌ను సందర్శించిన జెన్కో డైరెక్టర్ లక్ష్మయ్య

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్)లో శనివారం రాత్రి సంభవించిన పిడుగుపాటు ఘటనలో జెన్‌కో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. దేశ చరిత్రలోనే విద్యుత్ ప్లాంట్‌పై పిడుగు పడిన ఘటన ఇదే ప్రథమమని విద్యుత్ ఇంజనీర్లు అంటున్నారు. ప్రతి జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లైటనింగ్ ఎట్రాక్షన్ రాడ్ పరికరాన్ని అమరుస్తారు.

దాని వల్ల పిడుగు పడకుండా నివారించవచ్చు. దీన్ని బీటీపీఎస్ కర్మగారంలో అమర్చకపోవడం వల్లే పిడుగు పడినట్లు తెలుస్తున్నది. ఎల్‌ఏఆర్ అమర్చినా సక్రమంగా నిర్వహించని కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని కొందరు విద్యుత్ ఇంజినీర్లు అంటున్నారు. అయితే అసలు పిడుగు పడిందా, మరేదైనా ఉందా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

తప్పిన ప్రమాదం

శనివారం రాత్రి బీటీపీఎస్‌లో 1వ యూనిట్ జీటీ ట్రాన్స్ ఫార్మర్‌పై పిడుగు పడిన సంఘటనలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను సైతం లెక్క చేయకుండా విద్యుత్ యూనిట్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేశారు. లేదంటే పక్కనే మరో రెండు టీజీలకు, సమీపంలో ఉన్న హైడ్రోజన్ సిలిండర్లకు మంటలు అంటుకుని పెను ప్రమాదం జరిగేంది.

బీటీపీఎస్ కర్మాగారాన్ని జెన్కో డైరెక్టర్ బదావత్ లక్ష్మయ్య, సీఈ జనరేషన్ రత్నాకర్ సందర్శించి వివరాలు సేకరించారు. ఏ మేరకు నష్టం వాటిల్లిందో ట్రాన్స్‌ఫార్మర్‌ను తెరిస్తే గానీ తెలియదన్నారు. కర్మాగారంలో ఎల్‌ఏఆర్‌లు ఉన్నాయని, అవి పనిచేస్తున్నాయని వారు చెప్పారు. రూ.20 కోట్లు  వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదన్నారు.  

విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం

1వ యూనిట్‌లో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిం ది. అంటే రోజకు 6.48మిలియన్ యూ నిట్ల విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. యూనిట్ పునరుద్ధరణకు 30 నుం చి 45 రోజులు సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. సుమారు 291.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలిగినట్లే. యూనిట్ 6 రూపాలయకు విక్రయించినా 291.6 మిలియన్  యూనిట్లకు సుమారు రూ.174.96 కోట్లు నష్టం వాటిల్లితుందని చెప్పవచ్చు.