calender_icon.png 17 January, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షం మిగిల్చిన నష్టం!

03-09-2024 12:37:19 AM

  • రంగారెడ్డి జిల్లా అతలాకుతలం
  • పంట నష్టంపై అధికారుల అంచనా
  • యుద్ధప్రాతిపదికన తెగిన చెరువులు, కుంటల గండ్ల పూడ్చివేత  పనులు 

రంగారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నది. వానలతో జిల్లాలో భారీగా పంట, ఆస్తి నష్టం సంభవించింది. తెగిన చెరువులు, కుంటలకు పడిన గండ్లు పూడ్చివేత పనుల్లో యంత్రాం గం నిమగ్నమైంది. షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో వాగులు, వంకలు పొంగి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

సోమవారం ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులు యుద్ధప్రాతిపదికన రహ దారులకు మరమ్మతులు ప్రారంభించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో విద్యుత్ సరఫరాన పునరుద్ధరించే పనులు చేపడుతున్నారు. వర్షం కారణంగా జిల్లాలో వేలాది ఎకరాలు నీట మునిగాయి. దెబ్బతిన్న మెట్ట పంటలు, కూరగాయలు, పండ్ల తోటల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పంట నష్టపో యిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

నందిగామ, తలకొండపల్లి మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 13 సెం.మీ నమోదైంది. ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే 73 మిమీ వర్షపాతం నమోదైంది. వర్షాల షాద్‌నగర్, చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. జలకళను సంతరించుకున్న జలశయాలను కలెక్టర్ పరిశీలించారు. మూసీ పకీవాహక ప్రాంతాల పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.