26-04-2025 12:42:33 AM
గోపాలపేట ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్ పహాల్గామ్ లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో చనిపోయిన భారతీయు ల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు గో పాలపేట మండలంలోని బుద్దారం గ్రామం లో మజీద్ దగ్గర ముస్లిం సోదరులు ఉగ్ర దాడిలో మృతి చెందిన భారతీయులకు ఘ న నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సం దర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ భారతీయుల పైన ఉగ్రదాడి పిరికిపంద చర్యగా, ఉగ్రవాదులను హతమార్చడం కోసం భారతీయులమంతా ఏకం అవ్వాలని,ఉగ్ర దా డులతో భారత దేశ పర్యాటక అభివృద్ధిని నిలువరించలేరని గ్రామ ముస్లిం సోదరులు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బుద్దారం ముస్లిం మత పెద్ద లు,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
మహబూబ్ నగర్ ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : పహాల్గం ఉగ్ర దాడికి నిరసనగా దేవరకద్ర మండల కేంద్రంలోని జమియా మజీద్ లో శుక్రవారం ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలో ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ పర్యటకులపై దాడిని తీవ్రంగా ఖండించారు అమాయకులైన ప్రయాణికులపై దాడి చేయ డం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు మృతుల ఆత్మ శాంతి కలగాలని మౌనం పాటించారు.యావత్ భారత వాణి ఇలాంటి ఘటనలను ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వెంట నే సైనిక చర్యలను చేపట్టి ఇలాంటి చర్యలు చేపట్టి తగిన గుణపాఠం చెప్పాలని మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. క కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి మసీదుల్లో ముస్లిం ప్రత్యేక ప్రార్థనలు
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : పహాల్గం ఉగ్ర దాడికి నిరసనగా శుక్రవారం జిల్లాలోని ముస్లిం మైనారిటీలు ఆయా నియోజకవర్గాలు మండల ప్రధాన కూడళ్ల వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి ఆయా ప్రధాన మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశా రు. కేంద్రంలోని జమియా మజీద్ లో ప్రత్యే క ప్రార్థనలు అనంతరం జిల్లా కేంద్రంలోని పట్టణ పుర వీదుల గుండా ర్యాలీ నిర్వహిం చి మృతుల ఆత్మ శాంతి కలగాలని మౌనం పాటించారు. కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాదాన్ని రూపుమాపాలి
వనపర్తి, ఏప్రిల్ 25 ( విజయక్రాంతి ) : పచ్చని ప్రకృతి రమనీయతతో పర్యాటకులను ఆకర్షిస్తున్న పహల్గాంలో జరిగిన దాడితో భయానక పరిస్థితులు నెలకొనే లా చేసిన ఉగ్రవాదాన్ని రూపుమాపాలని వనప ర్తి ప్రజా సంబంధాల అధికారి సీతారాం తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉగ్రదాడి కి నిరసనగా, అందు లో మరణించిన అమరవీరులకు కొవ్వొత్తుల ప్రదర్శనతో వనపర్తి వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో శుక్రవారం నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డీపీఆర్‌ఓ సీతారాం మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతా లు, కులాల ప్రజలు ఐక్యమత్యంతో జీవిస్తున్నారని, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటున్నారని తెలిపారు. భారత ప్ర భుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ ను అభివృద్ధి చేస్తోందని, కొన్నేళ్లుగా పర్యాటకరంగం ఊపందుకుందని అన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన పర్యాటకులు పహల్గాం కు వెళ్తూ స్వేచ్ఛగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారని అన్నారు. కానీ ఇది ఓర్వలేని వారు ఉగ్రవాదులను ప్రేరేపించి.. పచ్చని కాశ్మీర్ లో అలజడి సృష్టించేందుకు దాడి చే యించారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ జర్నలిస్టు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకొని.. ఎలా కట్టడి చేయాలో ప్రత్యేక ప్రణాళిక రచించాలని కోరారు. ఇండ స్ వాటర్ ట్రీటీని వెనువెంటనే నిలుపుదల చేయడంతోపాటు క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని అన్నారు. భారతదేశం శాంతిని కోరుకుంటుందని అలా అని మన పౌరులపై దాడి చేసి చంపేస్తే ప్రతిఘటన కూడా తీవ్రంగా ఉండాలన్నారు.
సీని యర్ జర్నలిస్టు కొండన్న మాట్లాడుతూ భారతదేశంలో ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా దాయది పాకిస్థాన్ హస్తం ఉందని తేటతెల్లమైందని అన్నారు. ఉగ్రవాదాన్ని తరాలుగా పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా చితికిపోయినా.. దేశాభివృద్ధిని వదిలే సి.. కేవలం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అధికారి.(డిపీఆర్‌ఓ)సీతా రాం నాయక్, వర్కింగ్ సీనియర్ జర్నలిస్టులు. నోముల రవీందర్ రెడ్డి, బోలెమోని రమేష్, కొండన్న యాదవ్, జానీ,బొడ్డుపల్లి లక్ష్మణ్, పికిలి రాము,ఖలీల్, జర్నలిస్టులు.గోపాల్, దినేష్, కుమార్,శ్యామ్, శ్రీనాథ్,మల్లి ఖార్జు న్, తిరుపతి, బంకల రవి, పురుషోత్తం, గోపాల్, అనిల్, గట్టు శేఖర్,బొడ్డుపల్లి రాజు, అరుణ్ రాజ్, మదనాపురం రవి, గోపాల కృష్ణ,రాములు,గంధం రవి,ఫోటో గ్రాఫర్స్. యూసఫ్, ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.