calender_icon.png 30 January, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిరాతకుడు గురుమూర్తి

29-01-2025 01:37:58 AM

  1. పథకం ప్రకారమే మాధవి హత్య
  2. టెక్నికల్ ఆధారాలతో నేర నిర్ధారణ
  3. రాచకొండ సీపీ సుధీర్‌బాబు

ఎల్బీనగర్, జనవరి 28: పోలీసులకు సవాల్‌గా మారిన మాధవి హత్యకేసులో ఎట్టకేలకు సాంకేతిక ఆధారాలతో భర్త గురుమూర్తే నిందితుడని నిర్ధారించిన పోలీసులు అతడిని కటకటాల్లోకి పంపించారు. మాధవిని హత్య చేసిన తీరు విని పోలీసులే షాక్‌కు గురయ్యారు. మంగళవారం ఎల్బీనగర్‌లో రాచకొండ సీపీ సుధీర్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు.

మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ వెంకటేశ్వర కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పుట్టా గురుమూర్తి(39), వెంకటమాధవి(35) భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. మాజీ సైనిక ఉద్యోగైన గురుమూర్తి డీఆర్‌డీఎల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్యన నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

వీటి మనస్సులో పెట్టుకున్న గురుమూర్తి భార్యను అనవాళ్లు లేకండా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పక్కా పథకం ప్రకారమే ఈనెల 16న ఉదయం భార్య మాధవిని గోడకేసి కొట్టడంతో పాటు మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి చంపాడు. అదేరోజు బాత్‌రూంలో మృతదేహాన్ని చిన్నచిన్న ముక్కలుగా నరికి మాంసాన్ని కుక్కర్‌లో ఉడికించాడు.

ఆపై  గ్యాస్‌పై కాల్చి పొడిగా చేసి.. కమోడ్‌లో వేసి డ్రైనేజీలోకి వెళ్లేలా ఫ్లష్ చేశాడు. ఎముకలను బండరాయితో పొడిగా చేసి జిల్లెలగూడలోని చందన చెరువులో కలిపాడు. కేవలం తనతో నిత్యం గొడవ పడుతుందని ఈగోతోనే హత్య చేశాడని, ఇందులో వివాహేత సంబంధాలకు తావులేదని సమాచారం. కేసు ఇంకా దర్యాప్తులో ఉందని సీపీ తెలిపారు. 

 ఆయుధాలు, ఆధారాలు స్వాధీనం..

హత్యకు సబంధించి నిందితుడు వినియోగించిన దాదాపు 16 ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టౌవ్, కత్తి, రోలర్, రోలర్ స్టోన్, బకెట్, వెంకటమాధవి బట్టలు, గురుమూర్తిబట్టలు, ఫినాయిల్ బాటిల్, రూమ్ ఫ్రెష్‌నర్, సర్ఫ్ ప్యాకెట్లు, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, స్క్రాప్ బకెట్, మోటర్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు, వాటర్ హీటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.