calender_icon.png 24 February, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన హోరు..అధే జోరు

19-02-2025 01:37:54 AM

కన్నులపండువగా పెద్దగట్టు లింగమంతుల స్వామి కల్యాణం నేడు నెలవారం

విజయక్రాంతి, ఫిబ్రవరి 18 (సూర్యా పేట): దురాజ్‌పల్లి  శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.

ఉదయం కాస్త తక్కువగా హాజరైన మధ్యాహ్నం తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. మూడవ రోజు మంగ ళవారం యాదవ పూజారులు చంద్రపట్నం వేసి భక్తిశ్రద్ధలతో శ్రీ లింగమంతుల స్వామి, మాణిక్యమ్మల కల్యాణం జరిపించారు.

చంద్రపట్నంపై లింగమంతుల స్వామి వారు ఉన్న పెట్టెను ఉంచి పూజలు చేశారు. చంద్ర పట్నం ముందు మెంతబోయిన, మున్న, బైకాను వంశ స్తులు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, పోకలు, ఖర్జూరాలు ఉంచి స్వామివారి కథలతోకల్యాణ తంతు నిర్వహించారు. జాతరలో నాలుగో రోజు బుధవారం నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు.

దుకాణాల వద్ద భక్తుల కిటకిట

జాతరలో వెలిసిన దుకాణాల వద్ద భక్తుల నందకీ నెలకొంది. ఎక్కువగా మహిళలు గాజుల షాపు తోపాటు, అలంకరణ వస్తువుల వద్ద బారులుదీరారు జాతర గుర్తుగా గాజులు వేయించుకోవడంతో పాటు, బంధువులకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. 

నిరంతర వైద్య సేవలు

జాతరకు వచ్చే భక్తులకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స వైద్య సేవలు అందిస్తున్నారు. గట్టుకు నాలుగు దిక్కులు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల వద్ద ఆరోగ్యం పై అవగహన కల్పించడమేకాకుండా, మాస్కులు పంపిణీ చేస్తున్నారు.

కోనేరుకు తాళం... భక్తుల అసహనం

పెద్దగట్టుపై దేవాలయానికి ఉత్తరపక్క ఉన్న కొనేరులో భక్తులు స్నానాల ఆధరించి స్వామివారిని దర్శించుకునేవారు. పెరుగుతు న్న భక్తుల రద్దీకి అనుగుణంగా గుట్టపై కాకుండా గుట్ట ఉత్తర భాగంలోనే లక్షలు వెచ్చించి గతంలోని కోనేరును నిర్మించారు.

ప్రస్తుతం ఈ కోనేరుకు రంగులు వేసి మంచినీటిని నింపి సుందరంగా తీర్చిదిద్ది నప్పటికీ... భక్తులకు అందుబాటులోకి తీసుకు రాలేదు. కోనేరులోకి వెళ్లి గేట్లకు తాళాలు వేయడంతో కోనేరు కట్టింది దేనికంటూ భక్తులు అసహనం వ్యక్తం చేశారు.

అపరిశుభ్రంగా పరిసరాలు

లింగమంతుల స్వామి జాతరలో మూడో రోజు పారిశుద్ధ్య సిబ్బంది చేతులెత్తేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారంతో భక్తులు ముక్కులు మూసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి రెండు. రోజులు పక్కా ప్రణాళికతో పని చేసిన పారిశుద్ధ్య సిబ్బంది మూడో రోజు అంతగా దృష్టి పెట్టలేదు.