08-02-2025 07:08:59 PM
ఇల్లెందు (విజయక్రాంతి): క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి కోరం లక్ష్మీ అన్నారు. పరశురాం యూత్ ఆధ్వర్యంలో శనివారం ఇల్లందు జెకె కాలనీ సిఈఆర్ క్లబ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను కోరం లక్ష్మీ జ్యోతి ప్రజ్వలన (దీపారాధన) చేసి ప్రారంభింఛారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడలు శరీరదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చిన్నతనం నుంచే క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు, క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు.
రిబ్బన్ కట్ చేసి టాస్ వేసి, క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపి, ఈ యొక్క టోర్నమెంట్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించినారు. టోర్నమెంట్ నిర్వాహకులు కోరం లక్ష్మీని మహిళా నాయకురాలను, నాయకులను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ యదళ్లపల్లి అనసూర్య, మాజీ సర్పంచ్ పాయం స్వాతి, మహిళా నాయకురాలు మడుగు వెంకటలక్ష్మి, జిల్లా నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, నాయకులు పెద్దినేని హరినాథ్ బాబు, మార్కెట్ రాజు, జాన్సన్, హైజాక్, అలీ భాయ్, సోనీ, శంకర్, మేకల నాగేశ్వరరావు, వెంకటేష్, టోర్నమెంట్ నిర్వాహకులు బొల్లి రాజు, శేఖర్, బన్నీ, అజయ్, రాకేష్, షఫీ, నందులాల్, మాలోత్ రాజేష్, వెంకట్, చింటూ, ఎంపైర్స్ అమ్ముల్, ఆనంద్ క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.