వారి విగ్రహాలను పార్లమెంట్లో ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి చేస్తాం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ...
నిజామాబాద్ (విజయక్రాంతి): భారతదేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు దక్కుతుందని తమ వ్యవసాయ భూమిలోనే మామిడి చెట్టు నీడలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారని షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని ఆయన కొనియాడారు. బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. బీసీ సంఘాల కోరిక మేరకు పూలే దంపతులకు భారత అవార్డును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి సిఫార్సు చేసీ వారి విగ్రహాలను పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అన్నారు.
ఆ రోజుల్లో దళితులు శూద్రులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) స్త్రీలను విద్యకు దూరం చేయడానికి మనువాదంతో మనువాదులు ఎన్నో ఆంక్షలు పెట్టిన 1848 పూణేలో స్త్రీల కోసం మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేశారన్నారు. పూలే దంపతులు స్త్రీల కోసం మొట్టమొదటిసారిగా ఆన్ని కులాలకు ఒకే దగ్గర బడి ఏర్పాటు విద్య బోధన సాగించారన్నారు. మూడు సంవత్సరాలు తిరగకముందే 70 బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత పూలే దంపతులకు మాత్రమే దక్కుతుందని షబ్బీర్ అలీ అన్నారు. విద్యా వ్యాప్తికి వారి జీవితాలను పణంగా పెట్టారని విద్య ఎంత అవసరమో దానిపై వారు ఎన్ని కష్టాలు పడి ఉండొచ్చో వారు స్థాపించిన పాఠశాలలే నీదర్శనం. ఎవరు ఎన్ని విధాలుగా అవమానించిన సావిత్రిబాయి పూలే వారి మాటలను పట్టించుకోకుండా స్త్రీల కోసం విద్యను అందించారన్నారు. రాష్ట్రంలో కూడా ఆమె పేరిట ఒక స్మృతి వనాన్ని నిర్మించి సావిత్రిబాయి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు.