calender_icon.png 6 February, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ ఘనత రేవంత్‌రెడ్డిదే

06-02-2025 12:00:00 AM

సూర్యాపేట, ఫిబ్రవరి5 (విజయక్రాంతి): ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహంకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాదిగ,  తప్పట్ల శంకర్, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు