calender_icon.png 20 April, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది

10-04-2025 01:41:55 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బూర్గంపాడు/అశ్వాపురం, ఏప్రిల్ 9(విజయక్రాంతి):సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామంలో సన్నబియ్యం పేదలకు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సైతం సన్నబియ్యం తినాలానే ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రాష్ట్రంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం అశ్వాపురం మండలానికి చెందిన 44 మంది కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్  లబ్ధిదారులకు రూ.44,05104 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం తహశీల్దార్ స్వర్ణలత,డిటీ శివ కుమార్, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.