01-04-2025 06:38:43 PM
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు...
తుంగతుర్తి: భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారిగా పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలోని రేషన్ షాపులో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా క్వాలిటీ సన్న బియ్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామాల్లోని పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రస్తుతం 1400 కోట్ల మేరకు అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, నిరుద్యోగులు తమ కాళ్లపై నిలబడే విధంగా రాజీవ్ వికాస పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ వెంకన్న గుడిపాటి నరసయ్య దొంగరి గోవర్ధన్ ఝాన్సీ రెడ్డి దయానంద్ పాల్గొన్నారు.