calender_icon.png 4 April, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

04-04-2025 01:32:21 AM

ఎమ్మెల్యే బాలూనాయక్ 

దేవరకొండ, ఏప్రిల్ 3 :  దేశంలో తొలిసారి ఉచితంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయ క్ అన్నారు. డిండి (గుండ్లపల్లి)లో లబ్ధిదారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏఎస్పీ మౌనికతో కలిసి గురువారం బియ్యం పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే సిసలైన సంక్షేమానికి నిదర్శమని పేర్కొన్నారు. అర్హులందరికీ సన్నబియ్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందన్నారు.

పేద కుటుంబాల ఆకలి తీర్చేందుకే సీఎం ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. బియ్యం పంపిణీలో అవకతవకలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అర్హలందరికీ త్వరలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.  అనంతరం చందంపేట, నేరేడుగొమ్ము మండలం చెంచుకాలనీ (పలుగు తండాలోనూ లబ్ధిదారులకు ఆయన బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణా రెడ్డి, డీఎస్‌ఓ హరీశ్, డీటీసీఎస్ హన్మంత్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 3 ( విజయ క్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ ని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రారంభించారు.  బోధన్ పోచంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేసి మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో సన్నబియ్యం పథ కాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు.

ఈ పథకాన్ని ప్రజలు సద్విని చేసుకోవాలని కోరారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా తమ సర్కార్ పనిచేస్తుందని పేర్కొన్నారు మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, మహిళ లకు వడ్డీ లేని రుణాలు, నరులైన వారందరికీ రేషన్ కార్డులు యువతకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టమని వివరించారు. ప్రతిపక్ష పార్టీ ఓరవలేక తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని విమర్శించారు. బోనగిరి పట్టణంలోని రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఎల్బీనగర్ రేషన్ షాప్ లోవార్డు కౌన్సిలర్, తంగళ్ళపల్లి వాణి రవికుమార్, తాత నగర్‌లో మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.