బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గండూరి కృపాకర్
సూర్యాపేట, జనవరి 28 : ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ఘనత ఈ ప్రభుత్వాని దేనని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్లగొండలో జరిగే రైతు మహాధర్నాకు తరలి వెళ్లే వాహనాలను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ పాలన సాగిస్తుంధన్నారు.
రైతు భరోసా ఎకరానికి రూ.15000 ఇస్తానని చెప్పి కేవలం రూ.12 వేలకే పరిమితమితం చేసిందన్నారు. కౌలు రైతులను గుర్తించకపోవడం దారుణమ న్నారు. కృష్ణా జలాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. తదుపరి నల్లగొండకు బయలుదేరి వెళ్లారు. లతీఫ్, సందీప్, కళ్యాణ్, ధర్మపురం గ్రామమాజీ సర్పంచ్ నెమ్మది నగేష్, వేణు, కక్కిరేణి వెంకటేష్, కార్తీక్, నున్న యాదగిరి, దొంగరి లింగ స్వామి, రాజశేఖర్, సైదులు పాల్గొన్నారు.