calender_icon.png 10 October, 2024 | 2:50 AM

బిట్‌కాయిన్ సృష్టికర్త కెనడా వాసి

10-10-2024 12:59:32 AM

హెచ్‌బీవో డాక్యుమెంటరీ

టోరంటో, అక్టోబర్ 9: క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ను సృష్టించింది కెనడాకు చెందిన వ్యక్తిగా హెచ్‌బీవో డాక్యుమెంటరీ వెల్లడించింది. ఇంతకాలం బిట్‌కా యిన్‌ను జపాన్ దేశానికి చెందిన సతోషి నకమోటో తయారుచేశారని విశ్వసిస్తున్నారు. కానీ బిట్‌కాయిన్‌ను సృష్టించింది నకమోటో కాదని, కెనడాకు చెందిన పీటర్‌టోడ్డ్ అనే టెకీ అని డాక్యుమెంటరీలో తెలిపారు. 

డిట్ హబ్‌లో క్రిప్టోగ్రఫీ కన్సల్టెంట్‌గా టోడ్డ్ పనిచేస్తున్నాడు. ఈ మేరకు బిట్‌కాయిన్ మూలాలపై ‘ మనీ ఎలక్ట్రిక్: బిట్‌కాయిన్ మిస్టరీ’ పేరిట హెచ్‌బీవో డాక్యుమెంటరీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బిట్‌కాయిన్‌తో డీల్ చేసే చాలామందిని ఇంటర్వ్యూలు చేసి ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. బిట్‌కాయిన్  హష్‌క్యాష్‌ను తయారు చేసిన బ్యాక్ ఇన్వెస్టర్ రోగర్‌వెర్, మార్కెటర్ శాంసన్ మావో కూడా ఉన్నారు.