calender_icon.png 10 March, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు తీర్పు హర్షనీయం..

10-03-2025 05:11:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో పరువు హత్య కింద ప్రణయ్ ను హత్య చేసిన నిందితులకు ఒకరికి ఉరిశిక్ష మిగతా వారికి జీవిత ఖైదు శిక్ష ఇస్తూ తీర్పు ఇవ్వడం హర్షనీయమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కే లక్ష్మీ అన్నారు. నల్గొండ జిల్లాలో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కారణంతో ఉన్నత కుటుంబానికి చెందిన కొందరు పథకం ప్రకారం ప్రణయ్ ని దారుణంగా హత్య చేశారని నిందితులను కోర్టు విచారించి శిక్ష వేయడం మహిళా సంఘం తాము అభినందిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటన జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.