17-03-2025 12:42:38 AM
హీరో నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో విడుదలైంది ‘కోర్ట్’ చిత్రం. ప్రియదర్శి ప్రధాన పాత్ర లో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మార్చి 14న విడుద లైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ‘సెలబ్రేషన్ ఆఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్’ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హీరో నాని మాట్లాడుతూ.. ‘నేను ఈ రోజుదాకా స్క్రిప్ట్, ప్రేక్షకులు.. ఈ రెండు విషయాలనే నమ్మా. స్క్రిప్ట్ మా టీమ్‌ను గెలిచింది. తెలుగు ప్రేక్షకులు సినిమాను గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది. చాలా గర్వంగా ఉంది.
రానున్న రోజుల్లో ‘కోర్ట్’ పేరు మార్మోగుతుంది. ఇది గ్రేట్ క్యాలిటీ. ఇప్పటి నుంచే అసలు జర్నీ ఉంటుంది’ అన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “బలగం’ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రామ్ జగదీశ్ ఈ కథ చెప్పారు. ఈ కథ విని చాలా గొప్పగా ఫీలయ్యా. మాకు సపోర్ట్‌గా దీప్తి, ప్రశాంతి వచ్చారు. మేమంతా రాకెట్‌లో కూర్చుంటే మమ్మల్ని చుక్కల దాకా తీసుకెళ్లారు’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.