calender_icon.png 10 January, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట్ల కోసం పెద్ద స్కెచ్చేసిన జంట

01-01-2025 01:24:41 AM

* ప్రధాని కార్యదర్శి కూతురినంటూ పలువురికి టోకరా

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఈజీ దారిలో ఎటువంటి కష్టం లేకుండా కోట్లాది రూపాయలు సంపాదించేందుకు ఓ జంట ఏకంగా ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శి మిశ్రా కుమార్తె, అల్లుడంటూ కలరింగ్ ఇచ్చారు. ఇలా మోసాలు చేస్తూ చలామణి అవుతున్న వారిని చివరికి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఒడిషాలో ఈ దారుణం వెలుగుచూసింది. ఓ విలాసవంతమైన కార్యాలయాన్ని నడుపుతూ ఈ జంట తమకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయం ఉందని, ఈజీగా టెండర్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు గుంజేవారు.

ఈ జంట చేతిలో మోసపోయిన ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి బాగోతం బయటపడింది. పోలీసులు ఈ జంటను అరెస్ట్ చేశారు. ఈ జంటపై డిసెంబర్ 26న కేసు నమోదైందని అడిషనల్ డీసీపీ స్వరాజ్ వెల్లడించారు. ఈ జంట చేతిలో మోసపోయిన వారు ముం దుకొచ్చి ఫిర్యాదు చేయాలన్నారు.