calender_icon.png 21 January, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

26-08-2024 02:56:12 AM

  1. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
  2. వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

భద్రాచలం, ఆగస్టు 25:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఓ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసి ంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగారెడ్డిగూడెం మండలం ఆక్కంపేటకి చెందిన ఆళ్ల గణేశ్, పారెపల్లి జాహ్నవి 9 సంవత్సరాలుగా ప్రేమి ంచుకుంటున్నారు. వీరి ప్రేమను జాహ్నవి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఈనెల 19న భద్రాచలంలోని ఓ ఆలయంలో పెళ్ల్లి చేసుకున్నారు. ఈనెల 21న వా రు ఏలూరు వెళ్లి తమకు రక్షణ కల్పించాల్సిందిగా అక్కడి పోలీసులను కోరారు. అయితే పోలీసులు సరిగా స్పందించకపోవడంతో గణేశ్, జాహ్నవి తిరిగి ఈనెల 22న భద్రాచల ం వచ్చారు.

ఈ క్రమంలో జాహ్నవి కుటుం బ సభ్యులు, బంధువులు.. వారి వివాహానికి సహకరించాడంటూ గణేశ్ బంధువు రాజు పై దాడికి పాల్పడ్డారు. తనపై జరిగిన దాడి గురించి రాజు జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజుపై దాడి గురించి తెలుసుకున్న గణేశ్, జాహ్నవి.. శనివారం ఆత్మహత్య చేసుకొనేందుకు పురుగుమందు తాగారు. అనంతరం తమను అశ్వారావుపేటలో దించాలని ఓ ప్రవేట్ ట్యాక్సీని మాట్లాడుకొని వెళ్తున్న క్రమంలో బూర్గంపాడు మండలం సారపాక వద్దకు వచ్చే సరికి ఇద్దరూ కారులో వాంతులు చేసుకోవడంతో డ్రైవర్ వారిద్దరిని అక్కడే దింపి వెళ్లిపోయాడు. వారి పరిస్థితిని గమనించిన స్థానికులు బూర్గంపాడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఇద్దరిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.