12-03-2025 12:09:12 AM
విద్యతోపాటు సామాజిక స్పృహ ఎంతో అవసరం
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్
నాగర్ కర్నూల్ మర్చి 11 (విజయక్రాంతి) : యావత్ భారతదేశం ప్రగతి బాటలో నడవాలంటే ప్రస్తుతం యువత చేతుల్లోనే ఉందని వారంతా అందించిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని విద్యతో పాటు ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ కలిగి ఉండాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అభిప్రాయపడ్డారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో కేంద్ర యువజన క్రీడా సర్వీసులు శాఖ, మై భారత్, నెహ్రూ యువ కేంద్ర సహకారంతో స్వామి వివేకానంద సేవ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవ బృందం అధ్యక్షుడుశివ కుమార్ , జిల్లా యువజన అధికారీ కోటా నాయక్, కళాశాల ప్రిన్సిపాల్స్ రమాదేవి, తాసిల్దార్ తబిత రాణి, నాయకులు కళ్యాణ్ నాయక్, కట్ట సుధాకర్ సేవ బృందం సభ్యులు లక్ష్మి నరసింహ ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.