calender_icon.png 24 February, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వదేశీ భావజాలంతో దేశం ఆర్థికంగా మనుగడ సాధిస్తుంది

13-02-2025 02:05:45 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి12: స్వదేశీ భావజాలం కలిగి ఉండి  స్వదేశీ వస్తు వులను కొనుగోలు చేయడం వల్ల దేశానికి ఆర్థిక ప్రయోజనమే కాకుండా, కుటుంబం, గ్రామం, రాష్ర్టం, దేశం మొత్తం స్వయం సమృద్ధిని సాధిస్తుం దని స్వాలంబి భారత్ అభియాన్ ప్రాంతకో కన్వీనర్  ఇంద్రసేనా రెడ్డి, స్వదేశీ జాగరణ మం దక్షిణ మద్య క్షేత్ర సంఘటన కార్యదర్శి జగదీష్ జి ,  రాష్ట్రీయ స్వయంసేక్ సంఫ్‌ు తెలంగాణ  పూర్వ సంఫ్‌ు చాలాక్ బుర్లా దక్షిణామూర్తి  అన్నారు.

బుధ వారం స్వదేశీ మేళా ప్రారంభోత్సవ సంద ర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన వారూ మాట్లాడుతూ ముఖ్యంగా స్వదేశీ అనేది మన స్వయం సమృద్ధి తో పాటు దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాల్లో సహకారం చేసే అద్భుత తారక మంత్రమన్నారు. ముఖ్యంగా  స్వదేశీ వస్తువుల తయారీ దిగుమతి చేసుకు న్న వస్తువులపై ఆధారపడటాన్ని అధిగమిం చడంలో సహాయపడుతుందని, ప్రజలు స్వదేశీ వస్తువులు, ఉత్పత్తులను ఉపయోగిం చాలని వారు  ఈ సందర్భంగా పిలుపుని చ్చారు.

ప్రధానంగా స్వదేశీ వస్తువుల తయా రీదారుల కోసం కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రయోజనాలు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. స్వదేశీ మేళా ప్రోగ్రాంలో భాగంగా పాలిటెక్నిక్, ఇంజనీ రింగ్ విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహిం చారు. విద్యాతో పాటుగా  ఉద్యోగం, వ్యాపా రంలల్లో  రాణించలని,  ఉద్యోగం  ఇచ్చే స్థా యికి ఎదగాలని  ఈ వర్క్ షాప్ కార్యక్ర మంలో పాల్గొన్న  కరీంనగర్  పోలీస్ ట్రైనిం గ్ సెంటర్ సూపరిండిన్డెంట్  సుంకర శ్రీని వాస్ , ఐవివై స్కూల్ చైర్మన్  పసువుల మ హేష్  సూచించారు.

  ఈ సందర్భంగా పలు  కీలక అంశాలపై పై   సూచనలు చేసి, విద్యా ర్డుల భవిష్యత్తును తీర్చిదిద్దికోవడానికి  పలు ఉదాహరణలు చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో స్వదేశీ మేళా బాధ్యులు ముక్క హరీష్ బాబు, గంప వెంకట్, కళ్లెం వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.