25 May, 2026 | 2:39 AM

దేశానికి యువ నాయకత్వం అవసరం

25-05-2026 12:00 AM

ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవ రెడ్డి

ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి): అసంఘటిత, అస్థిరమైన ఉద్యోగాలలో ఉన్న యువ కార్మికులను సంఘటితం చేయడం, ప్రచారం చేయడం, బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని, ఇది చేయడానికి దేశానికి యువ కార్మిక నాయకత్వం అవసరం ఎంతైనా ఉందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు జి.సంజీవరెడ్డి తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో యువ కార్మిక నేత అద్వేల్లి శ్రీకాంత్‌ను ఐఎన్టీయూసీ మేడ్చల్ - మల్కాజిగిరి అధ్యక్షునిగా నియమిస్తూ జి.సంజీవరెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసురక్షిత పని పరిస్థితులు, అసంఘటిత రంగంలో ఉపాధికి రక్షణల కొరత, కార్మిక సంఘాల నిర్ణయ ప్రక్రియలో యువత గళానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే  ప్రభుత్వాల కార్మిక విధానాలకు వ్యతరేకంగా ఉద్యమాలు తీవ్రతరం చేయాలన్నారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ యువ కార్మికులను సమీకరిం చి, కార్మిక సంఘ ఉద్యమ పరిధిలోకి యువ నాయకులు తీసుకురావాన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిల్ షరీఫ్, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ యాదవ్, కోశాధికారి జగన్ పాల్గొన్నారు.