07-03-2025 01:36:56 AM
సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్
ఖమ్మం, మార్చి 6 (విజయక్రాంతి ): దేశ ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని బిజెపి సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బిజెపి రాష్ట్ర నాయకులు చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు.గురువారం ఖమ్మం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా అభివృద్ధి అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నారు రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని, ప్రజలంతా బిజెపి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపులో కార్యకర్తల కృషి ఎంతో ఉందని ప్రతి కార్యకర్త కూడా అలా కష్టపడితే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపు కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిదన్నారు. సమావేశం లో డాక్టర్ శీలం పాపారావు తదితరులు పాల్గొన్నారు.