06-04-2025 08:26:54 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు..
కామారెడ్డి (విజయక్రాంతి): బిజెపితోనే దేశాభివృద్ధి సాధ్యమని బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. ఆదివారం బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దేవునిపల్లిలో పలు చోట్ల పార్టీ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి అభ్యర్థులే గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు విపుల్ జైన్, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, నాయకులు రవీందర్, విట్టల్, నరేందర్, వేణు, ఆకుల భరత్ కుమార్, సంతోష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.