calender_icon.png 29 March, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశం మనుగడ సాధ్యం

24-03-2025 08:41:14 PM

జై బాబు జై భీమ్ జై సం విధాన్ అభియాన్ పేరుతో గ్రామ గ్రామాన పాదయాత్రలు..

కాంగ్రెస్ జాతీయ ఓబీసీ ఉపాధ్యక్షుడు కత్తి వెంకటస్వామి..

కామారెడ్డి (విజయక్రాంతి): రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశ మనుగడ సాధ్యం అని కాంగ్రెస్ జాతీయ ఓబీసీ ఉపాధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మతవాదుల నుండి దేశాన్ని కాపాడుకోవాలంటే మరోసారి గాందేయ మార్గంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పేరుతో గ్రామ గ్రామాన పాదయాత్రలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేపట్టాలని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని చాటిచెప్పి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రమాణం చేశారు.

హోం మంత్రి అమిత్ షాను పార్లమెంట్ నుంచి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేపట్టి కరపత్రాలు పంపిణీ చేయాలని అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ నరేష్ జాదవ్ బాన్సువాడ నియోజకవర్గం చైర్మన్ పొట్నక తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి రమేష్ గౌడ్ లింగాగౌడ్ కోతిమీర్ ఖర్ కన్నయ్య లక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాజా గౌడ్ ప్రసాద్, వివిధ నియోజకవర్గాలు నుంచి వచ్చిన మండల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.