calender_icon.png 26 November, 2024 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారుల చేతిలో పత్తిరైతు చిత్తు

27-10-2024 01:42:27 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో తెల్ల బంగారం గా పేరొందిన పత్తి తెల్లబోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఎక్స్‌వేదికగా పలు అంశాలపై స్పందించారు. పత్తి రైతులు దళారుల చేతిలో చిత్తవుతున్నారని, సీసీఐ పెట్టిన కొర్రీలు సాకుగా చూపించి ప్రభుత్వం కొనుగోళ్లను నిలిపేసిందన్నారు. రాష్ర్టం లో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి అని..

కీలకమైన కాటన్ కొనుగోళ్ల విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి ఎం దుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. సీఎం, ఆయన సోదరులు న్యాయవాది భూములకే ఎసరు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పోరాడుతుందని, మళ్లీ తమకు కాంగ్రె స్సే ప్రత్యర్థిగా ఉందన్నారు. గాంధీ ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు కల్పించడకుండా కాంగ్రెస్ పాలకులు గాల్లో చక్కర్లు కొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.