calender_icon.png 17 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీటకం ఖరీదు రూ.75 లక్షలు

08-07-2024 01:13:19 AM

లండన్, జూలై 7:  ఓ కీటకం ఖరీదు రూ.75 లక్షలంటే  నమ్ముతారా..? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం ఇదే.. దాని పేరే ‘స్టాగ్ బీటిల్’. మగ జింకల కొమ్ములను పోలినట్లు కాళ్లు, కొండీలు ఉండటంతోనే దీనికి ఆ పేరొచ్చింది. లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రతినిధుల ప్రకారం.. ఒక్కో కీటకం బరువు 2 నుంచి 6 గ్రాముల వరకు ఉంటుంది. ఆడ కీటకం పొడవు 30 నుంచి 50 మి.మీ, మగ కీటకం పొ డవు 35 నుంచి 70 మి.మీ వరకు ఉ ండొచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించటంతో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పశ్చిమ యూరప్ దేశాల్లోని పార్క్ లు, తోటల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. ఇవి కేవలం మృత వృక్షాల వద్దకే వెళ్తాయి. వాటిని తింటూ ఉం టాయి.

చెక్క వంటి పదార్థాలు తినేందుకు వీలుగా వీటి దంతాల నిర్మా ణం ఉంటుంది. ఇవి చెట్లు స్రవించే ‘సాప్’ ద్రవంతో పాటు కుళ్లిన పండ్ల నుంచి కారే స్రవాలనూ ఆహారంగా తీసుకుంటాయి. పచ్చటి వృక్షాల జో లికి అసలు వెళ్లవు. ఈ కీటకానికి ఎందుకంత ఖరీదు ? అంటారా.. కొ న్ని దేశాల్లో స్టాగ్ బీటిల్‌ను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. యూరప్ లో కొందరు సంపన్న వర్గాలకు చెందిన వారు ఈ కీటకం కొనడాన్ని ప్రతిష్ఠగా భావిస్తారు. అలాగే గౌట్ అనే సంక్లిష్టమైన ఆర్థరైటిస్, శోషరస వ్యవస్థకు సంబంధించిన జబ్బులను నయం చేసే ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.