స్కూల్ యాజమాన్యం డబ్బుల ఎర
నాయకులు, పోలీసుల సహకారంతో సెటిల్‌మెంట్?
జనగామ, ఆగస్టు 3(విజయక్రాంతి): జనగామలోని గౌతమ్ మోడల్ స్కూల్‌కు చెంది న ఒకటో తరగతి విద్యార్థి వరుణ్(6).. అడవికేశ్వాపూర్ గ్రామంలో శుక్రవారం సాయం త్రం స్కూల్ బస్సు టైరు కిందపడి చనిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘట నలో స్కూల్ యాజమాన్యంపై చర్యలు లేకుండా కొందరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని పోలీసుల సహకారంతో శనివారం బాలుడి కుటుంబంతో చర్చలు జరిపినట్లు తెలిసింది. యాజమాన్యం బాలు డి కుటుంబానికి రూ.14 లక్షలు ఇప్పించేలా ఒప్పించినట్లు సమాచారం.
తక్షణం రూ.లక్ష ఇచ్చి.. మిగతా మొత్తాన్ని మరో రెండు విడతల్లో ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై అనేక విమర్శలు వస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం నిర్ల క్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైతే.. చట్టరీ త్యా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి డబ్బులతో సెటిల్‌మెంట్ చేయడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. కాగా స్కూల్ బస్సుకు డ్రైవర్‌తో పాటు పిల్లలను సురక్షితంగా దింపేం దుకు క్లీనర్ కూడా తప్పకుండా ఉండాలి. కానీ క్లీనర్ లేకుండానే కొన్ని స్కూళ్లు బస్సులను నడుపుతున్నాయి.