calender_icon.png 2 April, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసిపాప ప్రాణం ఖరీదు రూ.1.25 లక్షలు

31-03-2025 01:30:53 AM

- న్యూమోనియాతో నాలుగు  రోజులుగా వైద్యం

- ఇంటికి వెళ్ళగానే పసిపాప మృతి 

- గజ్వేల్ ఆర్ వి ఆర్ ఆసుపత్రి పై బాధితుల దాడి, ఆందోళన 

- పోలీసులు, ఐఎంఏ జోక్యంతో రూ. 1.25ల నష్టపరిహారం

 గజ్వేల్, మార్చి 30 : పసిపాప ప్రాణానికి ఆ ఆసుపత్రి  రూ. 1.25 లక్షల ఖరీదు కట్టింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన  శ్రీకాంత్ ఉమారాణి దంపతుల మూడు నెలల  పసికందుకు గత ఐదు రోజుల క్రితం నిమోనియా వచ్చింది.

గజ్వేల్ లోని ఆర్ వి ఆర్ మదర్ చైల్ హాస్పిటల్ లో వైద్యుల సూచనల మేరకు రోజుకు రూ 30 వేల వ్యయంతో ఐదు రోజులుగా వైద్యం అందించారు. శనివారం మధ్యా హ్నం పాప ఆరోగ్యం కుదుటపడిందని ఇంటికి తీసుకు వెళ్ళవచ్చని ఆసుపత్రి సిబ్బం ది చెప్పడంతో కూతురుని తీసుకొని శ్రీకాంత్ ఉమారాణిలు ఇంటికి వచ్చారు.

ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి పాప చనిపోయింది. ఊపిరాడకపోవడంతో మళ్లీ వెంట నే గజ్వేల్ లోని ఆసుపత్రికి తరలివచ్చారు. పాప చనిపోయిందని చెప్పడంతో ఆరోగ్యం బాగా అయిందని పంపించిన పాప ఎలా చనిపోతుందని తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రిలో గొడవ చేశారు. శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకు చిన్నారి తల్లిదండ్రులు బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.

పోలీసులు ఐఎంఏ వైద్యుల సంఘం జోక్యంతో పాప తల్లిదండ్రులకు రూ. 1.25 లక్షల నష్టపరిహారం ఇచ్చారు. ఈ మేరకు ఆర్ వి ఆర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ చాణుక్యను వివరణ కోరగా, తాను వైద్యం బాగానే చేశామని, ఆస్పత్రిలో ఉన్నంతవరకు చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. కుటుంబ సభ్యుల తప్పిదం వల్లే ఇంటి వద్ద పాప మృతి చెంది ఉండవచ్చు అని చెప్పారు. అకారణంగా తమ ఆసుపత్రి పై దాడి చేసినందుకు సంబంధితులపై కేసు నమోదు చేస్తున్నట్లు చాణక్య తెలిపారు.

కాగా గజ్వేల్ పట్టణంలో  పలు ఆసుపత్రుల వైద్యులు తమ తప్పిదాలతో గర్భిణీలు, పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రాణాలకు పరిహారంగా లక్షల రూపాయలు  బాధితులకు చెల్లిస్తూ తమ తప్పులను కప్పిపుచ్చు కుంటున్నారు. ఈ విషయంలో వైద్యశాఖ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో  వైద్యులు  ఇష్టా రీతిగా  తమ ఆసు పత్రుల వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.

మామూళ్ల మత్తులో వైద్యశాఖ అధికారులు  ఉన్నంతకాలం  పసిపాపల, తల్లుల ప్రాణ నష్టం  కొనసాగుతూనే ఉంటుందని, ఇకనైనా వైద్యాధికారులు నిద్ర మేల్కొని ప్రైవే టు ఆసుపత్రులపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.