calender_icon.png 3 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి ‘ఆప్’ను ఊడ్చేయాలి

03-02-2025 01:40:55 AM

* ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాం తి): అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేయాల్సిన సమయం వచ్చిందని, ఆ పార్టీని ఎన్ని కల్లో ఊడ్చేయాలని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదివారం బీజేపీ తెలంగాణ కోశాధికారి బండారి శాంతికుమార్, పార్టీ ఢిల్లీ ప్రతినిధి నూనె బాలరాజుతో కలిసి ఈస్ట్ ఢిల్లీ, షాద్రా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆడంబరాలకు, అవినీతికి దూరంగా ఉంటూ పాలన చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆప్ నేతలు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ప్రజాధనాన్ని దోచుకుతిన్నారని మండిపడ్డారు.

ఢిల్లీ మద్యం స్కాం తెలంగాణకు విస్తరించిందని, ఈ స్కాం ఢిల్లీ ప్రజలు తలదించుకునేలా చేసిందన్నారు. ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామన్నారు.