calender_icon.png 19 April, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామస్తుల సహకారం మరువలేనిది: ప్రధానోపాధ్యాయులు

16-04-2025 08:06:37 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామస్తుల సహకారంతో పాఠశాలకు ఫర్నిచర్ సమకూర్చడమైనది. ఈ సందర్భంగా బుధవారం ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ... గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుల విరాళాల సహకారంతో 80 బెంచీలు, 10 డెస్క్ టేబుల్స్, పాఠశాల నేమ్ బోర్డ్ సమకూర్చుకున్నామని దీనివలన విద్యార్థులకు ఫర్నిచర్ కొరత తీరిందని గ్రామస్తుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.