calender_icon.png 16 March, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ మొరాయించిన కన్వేయర్ బెల్ట్!

16-03-2025 01:15:40 AM

రోబో సహాయక చర్యలకు ఆటంకం

నాగర్‌కర్నూల్, మార్చి 16 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. డేంజర్ జోన్ ప్రదేశంలో వినియోగిస్తున్న రోబోల్లో సాంకేతిక సమస్య తో ఇంకా వినియోగంలోకి రాలేదు. రోబో లు తవ్విన మట్టి, బురద ఇతర బండరాళ్లను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపేలా ప్రణాళి క రచించారు.

కానీ కన్వేయర్ బెల్ట్ మరోసారి మొరాయించడంతో రెస్క్యూ బృందాలు తలలు పట్టుకుంటున్నాయి. దీంతోపాటు నీటి ఊట నిమిషానికి 6వేల లీటర్లు చొప్పున సొరంగంలోకి వచ్చి చేరుతుండటంతో డేంజర్ జోన్ ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేరళకు చెందిన కడావర్ డాగ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఫలితం దక్కలేదు.

సొరంగం అంతటా దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ కార్మికుల ఆనవాళ్లు గుర్తించే ప్రదేశాన్ని కనిపెట్టలేక పోతున్నాయి. ప్రమాదం జరిగిన సమ యంలో సుమారు 16 టన్నుల బరువున్న టీబీఎం ప్రమాద దాటికి సుమారు 50 మీట ర్ల వెనక్కి తోసుకురావడంతో టీబీఎం హెడ్ కట్టర్ వెనుక భాగంలో కార్మికులు ఉండి ఉం టారని రెస్క్యూ బృందాలు అనుమానిస్తున్నాయి.

ఏఐ టెక్నాలజీ ద్వారా అన్వి రోబోస్ రంగంలోకి దిగినా పలు సాంకేతిక కారణాలవల్ల ప్రస్తుతం అవి పనులు ప్రారంభించలేదు. హైడ్రాలిక్ పవర్ రోబోతో పాటు వ్యాక్యూమ్ క్లీనర్ వంటి మరో రోబో టన్నెల్‌లోని ప్రమా ద స్థలంలో పనులు ప్రారంభించేందుకు రోబో నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. శనివారం మరోసారి రెస్క్యూ బృం దాలు అన్వి రోబోను పనుల బృందం రెస్క్యూ బృందాలతో అధికారులు సమీక్ష జరిపారు.