calender_icon.png 1 February, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మాణ రంగం నాశనమవుతోంది

01-02-2025 01:28:45 AM

  1. అందుకు ముఖ్యమంత్రి రేవంతే కారణం
  2. కాంగ్రెస్ పాలనలో బిల్డర్ల ఆత్మహత్యలు
  3. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలను చేజేతులా నాశనం చేస్తున్నాడని మాజీమంత్రి హరీశ్‌రావు మండిప డ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లతో పాటు ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్‌లో కేసీఆర్‌తో కలిసి ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉండేదని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫ్లాట్లు అమ్ముడుపోక ఓ బిల్డర్ ఉరేసుకొనే దుస్థితి రావడం దారుణమన్నారు.

ఈ ఆత్మహత్యలన్నింటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్యపాలన, అనాలో చిత విధానాలే కారణమని మండిపడ్డారు. శాంతి భద్రతలు దిగజారడం, కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం, మూసీ, ఫార్మాసిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు, ఇన్ఫ్రాస్ట్రక్చ ర్ డెవలప్‌మెంట్ చేయకపోవడం, భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు, కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఇతర రాజకీయ, ఆర్థిక పరిణా మాలు రియల్ ఎస్టేట్ రంగంపై గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో పెను ప్రభావాన్ని చూపాయని అన్నారు.

తెలంగాణ అభివృద్ధికి ఇరుసుగా ఉన్న వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ధ్వం సం చేశారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, ఇప్పటికైనా మేలుకోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ తిరోగమన బాటపట్టే ప్రమా దం ఉందని పేర్కొన్నారు.