10-04-2025 01:14:39 AM
రజతోత్సవ సభకు భారీగా తరలి వెళ్లాం..
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 9 (విజయక్రాంతి) కల్వకుర్తి- కొల్లాపూర్, సోమశిల-సిద్దేశ్వరం జాతీయ రహదారి 167 నిర్మాణం పూర్తయిందంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమేనని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ ప్రాంతంలో జరగబోయే భారీ బహిరంగ సభకు కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్దామని ముందస్తు ముఖ్య కార్యకర్తల సమావేశాలను పెద్దకొత్తపల్లి పెంట్లవెల్లి మండల కేంద్రాల్లో విడివిడిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే నని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయితోందని ఆరోపించారు.