21-03-2025 01:22:12 AM
పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి మార్చి 20 (విజయ క్రాంతి) ఓదెల మండలం ప్రజలకు జమ్మికుంట- వరంగల్ పోవాలంటే సుమారు 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.
గురువారం ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామంలో రూపు నారాయణపేట, విలాసాగర్ మధ్య మానేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన అనంతరం భూ సర్వే త్వరగా చేసి బ్రిడ్జి పనులు ప్రారంభించేలా అధికారులు త్వరగా సర్వే పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వే నిర్వహించి త్వరలోనే బ్రిడ్జి పనులకు టెండర్ పిలిసి శంకుస్థాపన చేసుకుందామన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వేర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.