calender_icon.png 19 March, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల నిర్మాణాలు గత ప్రభుత్వంతోనే సాధ్యమైంది

17-03-2025 01:59:59 AM

మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్, మార్చ్ 16 (విజయ క్రాంతి) : సనాతన ధర్మ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ భావి తరాలకు వాటి విశిష్టతను తెలియజేయలని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. పట్టణంలోని రణదీవే నగర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూమిపూజ శంఖుస్థాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులు నిర్వహించి, ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు చెడు అలవాట్లను విడనాడి.... సన్మార్గంలో పయనించాలని, తద్వారా మెరుగైన సమాజ నిర్మాణానికి పాటు పడాలని సూచించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆలయ నిర్మాణాలతో పాటు  ఆధ్యాత్మికతను పెంచే దిశగా కృషి చేయడం జరిగిందన్నారు. 

ఈ కార్యక్రమంలో హిజ్జగిరి నారాయణ, కోవా రవి, దమ్మ పాల్, కొండ గణేష్, నల్ల మహేందర్, రామేశ్వర్, చిందం శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.