calender_icon.png 23 October, 2024 | 6:09 AM

గడువులోగా ఎస్టీపీల నిర్మాణం పూర్తిచేయాలి

12-09-2024 01:23:12 AM

జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): గడువులోగా ఎస్టీపీల (మురుగు శుద్ధి కేంద్రాలు) నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి  ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో  ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్టీపీలకు విద్యుత్, స్థలం, న్యాయ పరమైన సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. తుది దశలో ఉన్న ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసి ట్రయల్ రన్‌ను నిర్వహించి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. 

ప్రారంభానికి సిద్ధంగా ఆరు ఎస్టీపీలు

ఇప్పటికే కోకాపేట, దుర్గంచెరువు, పెద్దచెరువు, నల్లచెరువులో ఎస్టీపీలు ప్రారంభమ య్యాయని ఎండీ అశోక్ రెడ్డి చెప్పారు. సిద్ధంగా ఉన్న నాగోల్, ఫతేనగర్, మిరాలం, ఖాజాకుంట, మియాపూర్, పటేల్‌చెరువు, సఫిల్‌గూడ ఎస్టీపీలను ఈ నెలాఖరులోపు ప్రారంభానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈడీ మయాంక్ మిట్టల్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితనేలే పాల్గొన్నారు.