calender_icon.png 22 February, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ జయంతి నాటికి అంబేద్కర్ భవన్ నిర్మాణం పూర్తికావాలి

21-02-2025 06:38:03 PM

మహాజన జిల్లా మహిళా కార్యదర్శి మేకల లత...

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భవన్ (ఎస్సీ కమ్యూనిటీ హాల్) నిర్మాణ పనులను వేగవంతం చేసి అంబేద్కర్ జయంతి నాటికి భవనాన్ని ప్రారంబించే విధంగా భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు కృషి చేయాలని మహాజన మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మేకల లత కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ (ఎస్సీ కమ్యూనిటీ హాల్) నిర్మాణంలో సంవత్సరాల తరబడి పనులు జరగడంలో జాప్యం కనిపిస్తుందని, ఇంత వరకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ భవన్ (ఎస్సీ కమ్యూనిటీ హాల్) నిర్మాణం పూర్తిస్థాయిలో వినియోగంలోనికి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

ప్రభుత్వాలు మారుతున్న మంత్రులు మారుతున్న కలెక్టర్లు మారుతున్న అంబేడ్కర్ భవన్ నిర్మాణంలో మాత్రం అభివృద్ధి లేదని వాపోయారు. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలకు ఉపయోడవడే అంబేడ్కర్ భవన నిర్మాణాన్ని ఎందుకు అలా వినియోగంలోనికి రాకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి లోపు అంబేద్కర్ భవన (ఎస్సీ కమ్యూనిటీ హాల్) నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ కి భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకటరావును ఆమె కోరారు. ఈ సమావేశంలో మహాజన మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, మాదిగ మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు గద్దల కృష్ణవేణి మాదిగ, కొప్పుల నాగమణి మాదిగ తదితరులు పాల్గొన్నారు.