calender_icon.png 5 February, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంవిధాన విధానం నిలబడాలి!

01-02-2025 12:00:00 AM

మాడభూషి శ్రీధర్ :

సుప్రీంకోర్టు 21 అక్టోబర్ 2024న పౌరసత్వ చట్టం, సవరణను సమర్థించింది. కాని, అందులో సౌభ్రాతృత్వ పదాలను స్పష్టంగా సమర్థించింది. 

రాజ్యాంగ పీఠిక రాయక ముందు మన రాజ్యాంగ సంవిధానాన్ని మార్చుకోవాలా లేదా అనే వివాదం వచ్చింది. నిజానికి అది మూడు ఎస్టేట్‌ల గొడవ. ఎవరు ముఖ్యం? ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్న ఎంపీలా లేక పార్లమెంట్ పెద్దలా లేక న్యాయమూర్తులా? ఎవరు పెద్ద? అప్పుడే చెప్పిన జవాబు: మౌలిక లక్షణాలను సవరించడానికి వీలు లేదు. (కేశవానంద భారతి కేసు).

ఈ మూడు ఎస్టేట్‌లకన్న పెద్దదై పోతున్న మరో ఎస్టేట్  ఇదివరకు ఫోర్త్ ఎస్టేట్ అనుకుంటున్నారు. కాని, దానికన్న పెద్ద ఎస్టేట్ రియల్ ఎస్టేట్. వారిని నడిపే పెద్ద కార్పొరేటర్లు, కంపెనీలు. పరిస్థితులు కంపెనీ రాజ్యం నుంచి, రాజ్యాంగ రాజ్యం నుంచి కార్పొరేట్ రాజ్యంగా మారిపోతున్నాయి. వాళ్లు డబ్బు ఇస్తారు.

బాండ్ అంటారు. వేల కోట్ల రూపాయలు ఇచ్చి ‘విరాళం’ అంటారు. ఆ డబ్బు తో రాజ్యాధికారం పిమ్మట కంపెనీలు, కార్పొరేట్‌ల ద్వారా రాజ్యాంగాన్ని హైజాక్ చేస్తున్నారా? ఫోర్త్ ఎస్టేట్‌కూడా వారి పాదాలకింద పనిచేస్తున్నది కదా.

మనం మధ్యమధ్య ‘ఫిఫ్త్ ఎస్టేట్’గా చైతన్యవంతులైన పౌరులు, దేశం గురించి ఆలోచించే, చదువుకున్న వారితో అయిదో వ్యవస్థ ముందుకు వస్తున్నది. అటువంటి వారి సంఖ్య పెరిగితే ఓట్లు వేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఫిఫ్త్ ఎస్టేట్‌గా నిలబడితే రాజ్యాంగ సంవిధానం నిలబడుతుంది. మనం అనుకున్న రాజ్యాంగాన్ని గెలిపిస్తుంది.

కీలకమైన ధర్మాసన చైతన్యం

‘సువిశాలమైన ఆలోచనతో సంకుచితమైన ఉద్దేశాలతో కాకుండా ఈ పీఠికను అర్థం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని సంవిధానాన్ని అవగాహన చేసుకోవాలి. పీఠిక కూడా సవరించుకోవచ్చు. ఎందుకంటే, మొత్తం రాజ్యాంగంలో ముఖ్యమైన భాగం పీఠిక కదా. అయితే, మనకు పీఠిక ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఆ స్ఫూర్తికి అనుగుణం గా భారత సంవిధానపు మౌలిక లక్షణాలను కోల్పోకూడదు’ అని సుప్రీంకోర్టు గొప్పనైన ధర్మాసనం కేశవనాంద భారతి కేసులో (ఏఐఆర్ 1973 ఎస్‌సీ 1461) ఎంతో కీలకమైన తీర్పును ప్రకటించింది. 

అంతకు ముందు బేరూబారీ కేసులో సుప్రీంకోర్టు పీఠికను రాజ్యాంగంలో అం తర్గత భాగంగా గుర్తించరాదని చెప్పింది. కాని, 1973లో కేశవానంద భారతి కేసులో అంతకు ముందు సుప్రీంకోర్టు వాదన, తీర్పు వ్యాఖ్యను ఉపసంహరించి, రాజ్యాంగంలోని అయోమయాన్ని కలిగించే భాగా లలో వదిలిపోవాలని, ఒక స్పష్టత కోసం ఈ పీఠికను ఆధారం చేసుకోవాలని చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది.

1995లో భారత ప్రభుత్వం- ఎల్‌ఐసీ మధ్య నడిచిన కేసు తీర్పులో మరొకసారి, ‘పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగమని’ తెలిపింది. మతాతీతమైన సమానత్వానికి సం బంధించిన సూత్రం ఇది. ‘సెక్యులరిజం అంటే నాస్తికవాదం, లేదా ఆతత్వం కాదు’ అని ఎంపీ గోపాలక్రిష్ణన్ నాయర్ (మరో ఇద్దరు) కేరళ రాష్ర్టం (తదితరుల) కేసులో సుప్రీంకోర్టు ఏఐఆర్ 2005 ఎస్‌సీ 3053 పేజీలో వివరిచారు.

‘సెక్యులరిజం ఒక మంచి ఉద్దేశమైన భావన. అవగాహన, విభిన్న మతాలపట్ల గౌరవాన్ని పెంచుకోవడం’ అని అరుణరాయ్ వర్సెస్ భారతదేశం కేసులో ఏఐఆర్ 2003 ఎస్‌సీ 3176లో వివరించారు. సంపూర్ణమైన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రతి పౌరుడికీ లభించాల ని మన సంవిధానం వాగ్దానం చేస్తున్నది.

దేశం మొత్తం జనాభాలోని ప్రతి పౌరుడు వారిలో అతి బలహీనుడైన వ్యక్తికూడా పేరులో రూపంలో బీదరికులకు కావాలని బాధించే దుర్మార్గానికి దాచుకునే విధానాలను క్షమించకుండా జనబాహుళ్యానికి సంవిధానం వాగ్దానం చేయాలని అంటున్నారని నందినీ సుందర్ వర్సెస్ ఛత్తీస్ ఏఐఆర్ 2011 ఎస్‌సీ 2839, పేరా 12లో తీర్పులో సుప్రీంకోర్టు వివరించింది.

మొద ట్లో రాజ్యాంగ చర్చలలో పీఠిక రచనలో 17 అక్టోబర్ 1949 నాడు రకరకాల పేర్ల గురించి ప్రస్తావించారు. భగవంతుడు (గాడ్) లేదా గాంధీ పేర్లతో పీఠికలో ఉం డాలన్నారు. మరొక పెద్ద నాయకుడు ‘యూనియన్ ఆఫ్ ఇండియన్ సోషలిస్టిక్ రిపబ్లిక్స్’ అని పిలవాలన్నారు. “దేవుడి పేరున” అని మరొక వాదన.

అంటే, ‘కొందరిని బలవంతంగా ఒకానొక భగవంతుడి విశ్వాసానికి ముడి పెట్టడం సరైందా?’ అని వాదన జరిగింది. గాంధీ పేరున పీఠిక ఉం డాలని వాదించే వారూ ఉన్నారు. గాడ్  గాంధీ నచ్చని వారుకూడా అభివ్యక్తి స్వేచ్ఛ వాడుకునే అవకాశం పోతుంది కదా.

ఇప్పుడు చూస్తున్నాం కదా, దేవుడిని గాంధీ ని కూడా తిట్టుకునే వారు, ఒకాయన చంపాలని, చంపిన వారు ఆ హంతకులో గొప్పవారని అనుకునే వాదాలు వింటు న్నాం కదా. అవన్నీ ఆలోచించిన తరువాత ఈ పీఠిక నిలబడింది. ఇప్పుడు ఈ విధంగా, మన ముందున్న పీఠిక ఇది.

ఆ లక్షణాలను తొలగించకూడదు

భారత రాజ్యాంగం పీఠికలో 2024లో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పులు ఇచ్చారు. 2024 అక్టోబర్ 22న  రాజ్యాంగ నిర్మాతలు సోషలిస్టు (సమసమాజం), సెక్యులర్ (మతాతీత) లక్షణాలను తొలగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. పాశ్చాత్య వ్యాఖ్యానాలను మన భారతీయ రాజ్యాంగ అన్వయాలను కొట్టి వేయడం జరగదని, 1976లో పీఠికలో తెచ్చిన సవరణలు రాజ్యాంగ బద్ధంగానే ఉన్నాయని సుప్రీంకోర్టు వివరించింది.

అంతేకాదు సమానత, సోదరభావనలను రాజ్యాంగ పీఠిక నుంచి తీసేయాలనే ఆలోచన రాజ్యాంగ వ్యతిరేకమని ధర్మాసన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లు స్పష్టం చేశారు. మన భారత ప్రజాస్వామ్యంలో ఈ లక్షణాలు మౌలికమైనవని ధర్మాసనం చెప్పింది. కేవలం మతాతీత సమానతకన్న మరింత విస్తారమైన గణనీయమైన అర్థాలను వివరించిద న్నారు. 

రాజ్యాంగ నిర్మాణంలో లేని పదాలను జొప్పించడం రాజ్యాంగ వ్యతిరేకమ ని అశ్వినీ ఉపాధ్యాయ్ తీర్పును నిర్దంద్వంగా తేల్చింది. ఈనాటి ప్రభుత్వం అనేక సందర్భాలలో సెక్యులరిజంను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కొట్టి పారేయాలని వారి అభ్యంతరాలను ఒప్పుకోలేదు. ఈనాటి సామాజిక రాజకీయ నేపథ్యంలో సెక్యులరిజం ప్రాధాన్యతను మరింతగా పెంచింద ని చెప్పారు.

అదే విధంగా సోషలిజం కూ డా ప్రధానమైందని గుర్తు చేసింది. అందరికీ సమానత ఇవ్వాలంటే తప్పేముంది, రాజ్యాంగ వ్యతిరేకత ఏముందని, సంపదను, వనరులను అందరికీ పంచడమే సోషలిజం అని అర్థం చేసుకోవాలని ఈ పీఠిక లక్షాన్ని సమర్థించారు. 

పాశ్చాత్య వ్యాఖ్యానాలని అనడం న్యాయం కాదన్నారు. 1976 సవరణ ద్వా రా రాజ్యాంగ లక్షణం నీరు గార్చాలని అనుకోవడం సరికాదు. సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి, గణతంత్రానికి పీఠిక బలోపేతం చేసిందే కాని బలహీనం చేయలేదని సుప్రీంకోర్టు తాజా తీర్పు వివరించింది. 1948 నవంబర్ 15 రాజ్యాంగ నిర్మాతలో ఒకరైన టి.కె.షా ఈ పదాలను వ్యతిరేకించినా ఒప్పుకోలేదని వివరించిం ది.

ఈ 1976 సవరణను 1989 ప్రజాప్రాతినిధ్య చట్టం నియమాలను కూడా వ్యతిరే కించదని వాదించడం సరి కాదు. అవి ఆర్టికల్ 19(1)(ఎ) ప్రాథమిక హక్కు వ్యతిరేకం అనడం విచిత్రంగా ఉంది.  బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యన్ స్వామి వేసిన పిటిష న్‌ను రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్టు, సెక్యులర్ పదాలను మరోసారి వ్యతిరేకించినా, 21 అక్టోబర్ 2024 నాడు సుప్రీం కోర్టు కొట్టి వేసింది. 

భారత రాజ్యాంగ పీఠి క పుస్తకం 2024 జూన్‌లో ప్రచురిస్తే, రెం డో ప్రచురణకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి అక్టోబర్ దాకా పీఠికపై రెండు గణనీయమైన తీర్పులు వచ్చాయి. అందులో ఒకటి పైన చర్చించాం. ఆగస్టు 14నాటి తీర్పులో పిల్‌ను సుప్రీంకోర్టు పీఠికకు సరిపోదన్న పిటిషన్‌ను కొట్టి వేసింది.

‘కనీసం ఓసారి పిటిషన్ ఈ పీఠిక చదువుకుంటే బాగుండేది’ అని సుప్రీంకోర్టు మందలించింది. ఉపాధ్యాయ్ తన అభ్యర్థనలో స్వేచ్ఛకు సోషలిజం వ్యతిరేకమని వాదించారు. సుప్రీంకోర్టు 21 అక్టోబర్ 2024న పౌరసత్వ చట్టం, సవరణను సమర్థించింది. కాని, అందులో సౌభ్రాతృత్వ పదాలను స్పష్టంగా సమర్థించింది.