calender_icon.png 19 April, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి ఆదర్శం

19-04-2025 02:05:32 AM

రాష్ట్ర ఎస్సీ , ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సూర్యాపేట, ఏప్రిల్18 (విజయక్రాంతి) : భారతదేశంలో ప్రతి ఒక్కరు సమానంగా స్వచ్ఛత వాతావరణంలో ఉండేలా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం రచనయే నేటి భావితరాలకు అన్ని వర్గాలకు సమకూలంగా  ఫలాలు అందేలా కృషి చేశారని రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని మున్యా నాయక్ తండ గ్రామపంచాయతీ ఆవాస గ్రామమైన పీక్లా తండాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మేధావులలో ఒకరైన  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు చదివి భారత దేశంలోని అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు నా కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్క వర్గాలకు సమన్యాయం చేకూర్చేలా భారత రాజ్యాంగాన్ని లిఖించారని అన్నారు.

ప్రపంచ దేశాలలో ముఖ్యమైన దేశాలను పర్యటించి ఆయా దేశాలలో ఉన్న రాజ్యాంగ ని చదివి వాటి నుండి గ్రహించి భారత దేశ రాజ్యాంగాన్ని దృఢమైన లిఖిత రాజ్యాంగంగా సంవత్సరలు పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని లిఖించాలని అన్నారు.నేటి సమాజంలో యువత కష్టపడి భావి భవిష్యత్తులో అత్యున్నత పదవులు ఉద్యోగాలు పొందాలని అన్నారు.సమాజంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి పనులు వైపు సాగాలని కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని అన్నారు.

సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అన్ని సంక్షేమ పథకాలు అర్హత ఉన్న అన్ని కులాల వరకు అందించేలా ఆనాడే భారత రాజ్యాంగంలో రాసిపెట్టిన ప్రపంచ మేధావి అని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కీర్తి ఏ భారతదేశానికి ఇంకా గొప్ప మహోన్నతునిగా ఎదిగేలా చేసిందని అన్నారు. భారతదేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలు అందరూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశం రాష్ట్రంలో ఉండే వాటిని అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు.

ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి దేశ జనాభా యే కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని,అంబేద్కర్ జీవిత కథనాన్ని చదువుకోవాలని కోరారు. భారత దేశంలోనే జనాభా ప్రతి ఒక్కరు కూడా ఎన్ని తరాలకు అయినా మరువలేని మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, జిల్లా షెడ్యూల్ కులాల అధికారులు కే శంకర్, లత, తహసిల్దార్ కృష్ణయ్య, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్త్స్ర మహేశ్వర్, సామాజిక కార్యకర్త నరసింహారావు,మాజీ సర్పంచ్ బికారి, మాజీ ఎంపిటిసి సుశీల సాగర్, విగ్రహ దాత సురేష్,విద్యార్థి సేన నాయకులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.