calender_icon.png 20 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు విశేష ఆదరణ

05-04-2025 12:00:00 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర  నరేందర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు వంద సంవత్సరాల క్రితం జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన విషయం ఈ తరానికి తెలుపుకుంటూ అదే విధంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించుకుంటూ బిజెపి నాయకులు అంబేద్కర్ ను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజలలోకి వెళ్తున్నామని తెలిపారు.

ఈ పాదయాత్రలో  నియోజక వర్గ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్, స్థానిక డివిజన్ల భాద్యులు గంట కళ్యాణి శ్రీనివాస్, దండి రవీందర్, జిడి రమేష్, కల్వల రామచంద్రం, కుర్రపోచయ్య, కీర్తి కుమార్, ముల్కల కవిత, యనమల మంజుల, మెండి చంద్రశేకర్, కర్ర రాజాశకర్, ముక్క భాస్కర్, రాజకుమార్, రోళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.