calender_icon.png 29 November, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర

29-11-2024 02:27:18 AM

  1. ఓ రాజకీయ పార్టీ ఉందని అనుమానం 
  2. విచారణ చేసి బాధ్యులను తేలుస్తాం 
  3. అధికారుల ప్రమేయం ఉంటే ఉద్యోగం నుంచి తొలగిస్తాం 
  4. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్  

హైదరాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో జరుగుతున్న పుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని ఉద్యోగం నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తామని హెచ్చరించారు.

ఈ ఘటనల వెనుక ఓ రాజకీయ పార్టీ ఉన్నట్టు తమకు అనుమానం ఉందని, అన్ని విషయాలను త్వరలో తేలస్తామని మంత్రి స్పష్టంచేశారు. గాంధీభవన్‌లో గురువారం సీతక్క మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే బీఆర్‌ఎస్ నాయకులు ఎక్కడికి పోలేదని విమర్శించారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. తాము నలుగురు మంత్రులం అక్కడే ఉన్నామని, ఆ అమ్మాయి బతికించేందుకు రూ.4 లక్షల వరకు ఖర్చు పెట్టామని సీతక్క స్పష్టంచేశారు.

చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటు కారణంగానే బాధిత విద్యార్థిని చనిపోయిందని వెల్లడించారు. బాధితురాలి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం  అండగా ఉంటుందని స్పష్టంచేశారు.