15-04-2025 01:33:09 AM
- వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ ఏప్రిల్ 14 : నిరుపేదలకు అందుబాటులో ఉంటూ కూడు, గూడు, గుడ్డ ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన, మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొనడమే కాకుండా గిట్టుబాటు ధర కల్పించామని, బోనస్ అందించామని ఆయన గుర్తు చేశారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వేముల కృష్ణయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, నవనీత , శ్రీశైలం యాదవ్, యాదిరెడ్డి, రఘుపతి రెడ్డి, తహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపిడిఓ యశోద తదితరులు పాల్గొన్నారు.