27-03-2025 12:50:30 AM
తలకొండపల్లి,మార్చి 26(విజయక్రాంతి):గత శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రేస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ లకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన హామికి చట్ట బద్దత కల్పించే భాద్యత కాంగ్రేస్ పార్టీదేనని బీసీ సంక్షేమ సంఘం తలకొండపల్లి మండల అద్యక్షుడు గుజ్జరి రాఘావేందర్ అన్నారు.తలకొండపల్లి మండల కేంద్రంలో బుదవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘావేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం శుభపరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు.అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి తమ పని పూర్తయిందని కాంగ్రేస్ పార్టీ నేతలు చేతులు దులుపుకోకుండా బిల్లు పార్లమెంట్ లో చట్టబద్దతకు ఆమోదం పొంది రెజర్వేషన్లు అమలయ్యే వరకు పూర్తి భాద్యత తీసుకోవాలని కోరారు.
తమపని అయిపోయిందని తదుపరి కార్యాచరణ కేంద్ర ప్రభుత్వ భాద్యతని వారిపై నెట్టడం సరైన పద్దతి కాదని మీరుకూడా భాద్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.బీసీలు విద్య,ఉపాది అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వారికోసం ప్రభుత్వాలతో గత యాభై ఏల్లుగా పోరాటం చేస్తున్న జాతీయ బిసి నాయకుడు ఆర్ కృష్ణయ్యను కొందరు విమర్శించడం వారి వివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు.ఆర్ కృష్ణయ్య పోరాటల పలితంగా బీసీలకు 2 వేలకు పైచిలుకు జీవోలు,1500 గురుకుల పాఠశాలలు,6 వేల సంక్షేమ హాస్టల్లు,స్కాలర్ షిప్ లు,ఫిజురియంబర్స్మెంట్,మెస్సు బిల్లుల వంటి అనేక పథకాలు సాదించి బిసి విద్యార్థులు అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేసిన ఆయనను విమర్శిండం అంటే మనని మనమే కించపర్చుకోవడమే అన్నారు.
ఆర్ కృష్ణయ్య సహకారంతో ఉద్యమాలలో పాల్గొని ఎదిగిన కొందరు బిసి నేతలు నేడు ఆయననే విమర్శిండం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.అదికారం లోకి రావడానికి రాజకీయ పార్టీలు బిసిలను నిచ్చన మెట్లుగా వాడుకుని అదికారం లోకి రాగానే మర్చిపోవడం పరిపాటిగా మారిందని అలాంటి వారి ఆటలు సాగకుండా బిసి బిడ్డలంత ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని,అందుకోసం బిసిలందరు కార్యోన్ముకులై ముందుకు రావాలని రాఘావేందర్ కోరారు.ఈ సమావేశంలో మండల బిసి సంక్షేమ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.