calender_icon.png 25 March, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ముస్లింలకు రూ. 3,000 కోట్ల నిధులు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే

24-03-2025 12:05:25 AM

మంథనిలో ఇఫ్తార్ విందులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, మార్చి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వేల కోట్లతో బడ్జెట్ లో నిధులు ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మంథని పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో  మంత్రి  శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ వేడుకల సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అందరూ  సుఖంగా ఉండాలని ముస్లింలు  ఈ పవిత్ర మాసంలో ప్రార్థన చేస్తారని కొనియాడారు.  సమాజంలో వీరందరూ కూడా పెద్ద పాత్రధారులమన్నారమా ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా రూ. 3000 వేల పై కోట్లను బడ్జెట్లో పెట్టడం జరిగిందని,  ఎప్పుడో మూలబడ్డ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ దార కూడా చదువుకునే యువతకి మైనారిటీలకు స్వయం ఉపాధి పథకాలతో పాటు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను కొనసాగిస్తామని, గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ ఫోర్ కు సంబంధించి మొన్న దాదాపు వందలాది మంది గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తే మా మైనారిటీ సోదరులకు అనేకమంది కూడా గ్రూప్ వన్ పరీక్షలు లో ఉత్తీర్ణులై వారికి  నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.

అదేవిధంగా మీటర్ ఉద్యోగాల్లో కూడా వారికి ప్రవేశ పొందటానికి ఒక అవకాశం ఉందని,  ముస్లిం సోదరులకు త్వరలోనే ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తామని, మా ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ మాసం   శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంథని ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.