calender_icon.png 26 February, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలనలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం

26-02-2025 01:16:48 AM

ఎంపీ ఈటల 

మంచిర్యాల, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : రాష్ట్రా న్ని పాలించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్‌గిరి ఎం పీ ఈటల రాజేందర్ అన్నా రు. మంగళవారం సాయం త్రం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 నెలల పాలనలోనే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కిందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే రేవంత్ రెడ్డి మూడు జిల్లాలో పర్యటించి బీజేపీ పార్టీ పై విషం కక్కారని అన్నారు. నిరుద్యోగ యువతను, ఉపాధ్యాయులను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందని విమర్శించారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఈ నెల 27 న జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు గోమాస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి, గుజ్జుల రామకృష్ణ రెడ్డి, రజనీష్ జైన్, రావుల రామనాథ్, పెద్దపల్లి పురుషోత్తం, తుల ఆంజనేయులు, జోగుల శ్రీదేవి, అమిరిశెట్టి రాజు, పల్లి రాకేష్ పాల్గొన్నారు.