26-02-2025 01:38:44 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 25: ఆరు గ్యారెంటీల మాటున అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని తీరా అధికారంలో కి వచ్చిన తరువాత హామీలను అమలు చేయడం లో విఫలం అయ్యిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ 2 లక్షల రుణమాఫీ కాలేదని, రైతులు మరియు కౌలు రైతులకు రైతు భరోసా రూ 15000 రైతు కూలీలకు రూ 12000, ఇవ్వలేలేదన్నారు. ప్రభుత్వం పాలించడానికి చేతకాక రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారన్నారు. వనపర్తిలో సాక్షాత్తు రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి ,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయని ఎమ్మెల్యే మెగా రెడ్డి బోగస్ శంకుస్థాపనలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారని కాంగ్రెస్ వర్గ పోరులో వనపర్తి అభివృద్ధిలో కుంటుపడిందని తీవ్రంగా విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల పట్ల రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆ నిర్లక్ష్య ఫలితమే ఎస్‌ఎల్బీసీ టన్నెల్ లో పనిచేసే కార్మికులు మూడు రోజులుగా ఆచూకీ లేకపోయినా ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ధ్యాస తప్ప ప్రజల ప్రాణాల పైన లేదని ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర మేల్కొలన్నారు.
ఈ సమావేశంలో రాష్ర్ట కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకట్ రెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జిల్లా మీడియా ఇన్చార్జి పెద్దిరాజు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బండారు కుమారస్వామి ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఆగపోగు కుమార్ పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.