calender_icon.png 18 March, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఓ చిత్తు కాగితం

18-03-2025 12:26:46 AM

  1. ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం ఏమైంది?
  2. విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తరు?
  3. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ మేనిఫెస్టో ఓ చిత్తుకాగి తమని, రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను గమనిస్తే ఈ విషయం తెలిసిపోతుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. శాసనమండలిలో సో మవారం ఆమె మాట్లాడుతూ.. మహిళలను మోసగించి ఓట్లు రాబట్టేందుకే కాంగ్రెస్ ఎన్నికల ముందు లేనిపోని హామీలిచ్చిందని, ఇప్పుడు వాటిని అమ లు చేయడం లేదంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

ఆడబిడ్డల పెండ్లికి తులం బంగా రం, మహిలకు నెలకు 2,500, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కల్యాణమస్తు పథకం కింద ఆడపి ల్లల పెండ్లిళ్లకు రూ.లక్ష కానుకతో పాటు తులం బంగారం ఎప్పుటి నుంచి ఇస్తారని నిలదీశారు. ఆమె ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ.. త్వరలోనే హామీలను అమలు చేస్తామని వెల్లడించారు.

మంత్రి సమాధానానికి కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలు ముగిసిన అనంతరం ఆమె మం డలిలోని మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం గ్రూప్- 1,2,3 పరీక్షల పేపర్లను రీవాల్యూషన్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలపై వేలాది మంది అభ్యర్థులు అనే క అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం వారి అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటివరకు గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెల్లడించకపోవడం నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యా నించారు. రైతులు పండించిన మిర్చి క్వింటాకు రూ.25 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం తోటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల తో కలిసి మిర్చి ధరలు పతనంపై మం డలి ఆవరణలో నిరసనకు దిగారు.