calender_icon.png 16 January, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరచేతిలో వైకుంఠం చూపుతున్న కాంగ్రెస్

04-08-2024 01:18:57 AM

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్, ఆగస్టు 3(విజయక్రాంతి): బడ్జెట్ పేరున కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతి లో వైకుంఠం చూపెట్టిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారయణగుప్తా విమర్శించారు. బడ్జెట్ సమావేశాలపై శనివారం నిజామాబాద్ బీజేపీ కార్యలాయంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో పేదప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సైతం నిదులు కేటాయించలేదని విమర్శించారు. ఆరు గ్యా రెంటీలను, ఐదు డిక్లరేషన్లను, 420 హామీలను పక్కనపెట్టిందని అన్నారు.

మహిళలకు ఇస్తామన్న రూ.2,500, ఇందిరమ్మ ఇండ్లు, విద్యా భరోసా కింద రూ.5 లక్షలు, రూ.4 వేల పెన్షన్లను పక్కన పెట్టి గాడిదగుడ్డను ఇచ్చిందని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తున్నామంటూ మిగిలిన గ్యారెంటీలకు శఠగో పం పెట్టిందని విమర్శించారు. నిబంధనల పేరుతో రుణమాఫీని సైతం ఎగ్గొట్టే ప్రయ త్నం చేస్తోందని అన్నారు. కులానికో కార్పొరేషన్ పెట్టిన రేవంత్ సర్కార్.. నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన 648 డబులు బెడ్‌రూం ఇళ్లను పేదలకు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. నిజాం షుగర్స్‌ను పునప్రారంభించాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ డిమాండ్ చేశారు.