04-03-2025 12:22:25 AM
గతంలో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది బీఆర్‌ఎస్ పార్టీ కాట్నపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలో ఎమ్మెల్యే విజయరమణరావు
పెద్దపల్లి మార్చి 3 ః పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణరావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధికారులతో మరియు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ముగ్గు పోసి భూమి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదలకు, బడుగు వర్గాల ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని గత ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మడమ తిప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఇండ్ల నిర్మాణాలకు మంజూరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఇండ్లు నిర్మించుకోవడానికి అవసరమైన అన్ని హంగులను సిద్ధం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులను కోరారు. జాప్యం లేకుండా ఇళ్ళను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సాయిరి మహేందర్, దానాయక్ దామోదర్ రావు,దుగ్యల సంతోష్ రావు, సతీష్ రావు,
ఆనంద రావు, కాల్వల శ్రీనివాస్, బిరుదు కృష్ణ, అబ్బాయి గౌడ్, శేఖర్, మాతంగి లచ్చయ్య, సుల్తానాబాద్ మండలం యూత్ అధ్యక్షులు అజయ్, దాసరి రాజమల్లు, తిరుపతి రెడ్డి, సంపత్ రెడ్డి,మల్లయ్య, శ్రీధర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.