calender_icon.png 7 April, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం

06-04-2025 05:52:38 PM

సన్న బియ్యం పంపిణీ పట్ల మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం..

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్..

మంథని (విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మంథని మండలం పుట్టపాక గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చాట్లపల్లి సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, గ్రామస్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... పేదవారు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.

ఇందులో భాగంగానే రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సన్న బియ్యం పంపిణీ వల్ల ప్రభుత్వంపై 3 వేల నుంచి 4 వేల కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతున్నా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే తమ ప్రభుత్వం ముందడుగు వేసిందని అన్నారు. పేదవారికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకే రైతులకు రూ. 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లు పండించడానికి వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఐలి శ్రీనివాస్, కల్వల రాజేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సవాయి గట్టయ్య, ఇల్లుటం వెంకటేశం, అవునురి రాజేశం, కన్నూరి రవి,  రాజబాబు, చంద్ర మూర్తి, కొత్త ప్రవీణ్, సిరిశెట్టి అశోక్, సదానందం, ముప్పిడి సురేష్, మరిశెట్టి కుమార్, మహిళా అధ్యక్షురాలు హుస్సేన్ బి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.