20-02-2025 01:20:11 AM
* తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులు అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చింది?
* జీపీఎఫ్ దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోంది
* పీఆర్సీసహా ఏ సమస్యనూ పరిష్కరించలేని అసమర్ధ సర్కార్ కాంగ్రెస్
* డీఏలు, జీపీఎఫ్, మెడికల్, గ్రాట్యుటీ పేరిట రూ. 8,200 కోట్ల బకాయిలు ఇవ్వలేదు
* కుల గణన పేరుతో 60 లక్షల మంది బీసీలను తగ్గించే కుట్ర
* కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇవాళ జీతభత్యాలు, సమస్యల పరిష్కారం కోసం అడుక్కునే దుస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలని అన్నారు.
బుధవారం రాత్రి ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని సీతారాంపూర్ లో నిర్వహించిన అధ్యాపక, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డీఏలు, పెండింగ్ బిల్లులతోపాటు జీపీఎఫ్ దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తొందని మండిప డ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉద్యోగులుసహా ఏ ఒక్కవర్గమూ సంతోషంగా లేద న్నారు. ప్రభుత్వంలోనూ లుకలుకలు మొదలయ్యాయని, సొంత పార్టీ ఎమ్మెల్యేలు అస మ్మతి పేరుతో రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరలోనే అనరత వేటు పడటం తథ్యమన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా 7 సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.
మీరంతా తప్పకుండా ‘చావా’ సినిమాను చూడాలి. కుహానా లౌకిక వాదుల నుండి సమాజాన్ని కాపాడటంతోపాటు నిజమైన చరిత్రను ప్రజలకు తెలియజేయాలంటే ఇట్లాంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, పూలె, సావర్కర్ వంటి యోధులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని భావిస్తుంటే.... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తుపాకీలు పట్టుకుని నక్సల్స్‌గా తయారు చేసేలా విద్యా వ్యవస్థను తయారు చేయాలని చూస్తోందన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
తెలంగాణలోని ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఒక రికార్డు చరిత్ర పుటల్లో నమో దై ఉందన్నారు. 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సా ధించుకున్నరు.. తెలంగాణ సాధనలో రాజకీయ పార్టీల పాత్ర ఎంత ఉందో... ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర అంతకంటే ఎక్కువే ఉందన్నారు.
మరి మీరు ఇంత త్యాగం చేసి...తెగించి కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే మీకేం ఒరిగిందే?... కష్టాలు, కన్నీళ్లు, బాధలు తప్ప.. తెలంగాణ సాధించుకున్నందుకు సంబురపడాలో... ఇంకా జీతభత్యాలు, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, గ్రాట్యూటీ బిల్స్ కోసం అడుక్కునే పరిస్థితి వచ్చిందని బాధపడాలో తెలియడం లేదన్నారు. రాష్ర్టం కోసం తెగిం చి కొట్లాడినోళ్లు... ఇయాళ జీతభత్యాలు, బదిలీలు, ప్రమోషన్లు, జీపీఎఫ్ పైసల కోసం అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చే.... కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు.
317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని, దాని రద్దు కోసం బిజెపి పోరాటం చేసిందన్నారు. కఇయాళ పెండింగ్ డీఏలు, జీపీఎఫ్ బకాయిలు, మెడికల్ బిల్లులు, గ్రాట్యుటీ పెన్షన్ బకాయిలు మొత్తం కలిపితే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 8 వేల 200 కోట్లు బాకీ పడ్డదని అన్నారు. మీకోసం పోరాటాలు చేసింది బీజేపీ. మీ హక్కుల కోసం తపస్ తప్ప ఇప్పుడున్న ఏ సంఘమూ ముందుకు రాకుంటే... మీ కోసం తెగించి కొట్లాడింది బీజేపీ అని అన్నారు.బీసీ కులగణన పేరుతో ముస్లింలను బీసీజాబితాలో చేర్చి బీసీలకు నష్టం చేస్తోందన్నారు.
బీసీ జనాభాను తగ్గించే కుట్ర చేస్తోందని, రాష్ర్ట జనాభా 4 కోట్ల 30 లక్షలని అందరికీ తెలుసు... 3 కోట్ల 95 లక్షల మందికి తెలంగాణలో ఆధార్ కార్డులున్నయి, మరి 3 కోట్ల 70 లక్షల మంది అని ప్రభుత్వం ఎట్లా చెబుతుంది? మిగిలిన 60 లక్షల మందిని ఏమైనట్లు అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ మోస పూరిత విధానాలకు గుణ పాఠం చెప్పే టైం ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఇప్పుడు మీకొచ్చిందని,మీకోసం పోరాడుతూ హిందూ భావజాలమున్న బీజేపీకి మద్దతివ్వలని, మీ నిర్ణయం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందన్నారు. మీకోసం కొట్లాడిన బీజేపీ కార్యకర్తలంతా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నరని, బిజెపి అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ కుమార్ కోరారు.